Skip to main content

AP Grama Sachivalayam New Rules : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాలు ఇక‌పై ఇలా...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి ప్ర‌భుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల‌ను ఎదో ఒక విధంగా ఇబ్బంది పెట్టెలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఏపీ గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేషనలైజేషన్ అమలు చేయనుంది.
Andhra Pradesh government’s new approach to village and ward secretariats  ap grama sachivalayam new rules   AP government divides village and ward secretariats into 3 categories

కనీసం 2500 మంది జనాభాకి ఒక సచివాలయం ఉండేలా చూస్తోంది. దీనిలో ఇద్దరు మల్టీపర్సస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు. 2500-3500 మందికి ఏడుగురు, 3501 నుంచి ఆపై జనాభాకు 8 మంది ఉండేలా సచివాలయ ఉద్యోగులను విభజిస్తారు. దీని ద్వారా ఉద్యోగుల‌పై మ‌రింత భారం ప‌డ‌నున్న‌ది.

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల విభజన ఇలా..
➤☛ మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్‌ విభాగం : గ్రామ సచివాలయ పరిధిలో: పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్, సంక్షేమ, విద్య సహాయకులు, గ్రామ మహిళా పోలీసులు ఉంటారు.

వార్డు సచివాలయం పరిధిలో ఇలా.. : 
➤☛ వార్డు పరిపాలన కార్యదర్శి, విద్య, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఉంటారు

➤☛ టెక్నికల్‌ ఫంక్షనరీస్‌ విభాగంలో ఇలా.. :
గ్రామ సచివాలయం పరిధిలో..: గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్‌ఎం, సర్వే సహాయకులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, వ్యవసాయ కార్యదర్శి, పశుసంవర్ధక కార్యదర్శి, ఎనర్జీ సహాయకుడు 

వార్డు సచివాలయం పరిధిలో..: 
వార్డు రెవెన్యూ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ప్లానింగ్‌ కార్యదర్శి, మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శి, శానిటేషన్‌ కార్యదర్శి, ఎనర్జీ కార్యదర్శి 

3 కేటగిరీలుగా ఇలా..
1. 2500 జనాభాలోపు ఉంటే ఇద్దరు మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్‌ ఫంక్షనరీస్‌ ఉంటారు. 
2. 2500- 3500 జనాభాకు ముగ్గురు మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్‌ ఫంక్షనరీస్‌ ఉంటారు.
3. 3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్‌ ఫంక్షనరీస్‌ ఉంటారు. 

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువగా, మరికొన్నిచోట్ల తక్కువగా ఉన్నారు. రేషనలైజేషన్‌ ద్వారా దీన్ని సరిదిద్దనున్నారు.  దీంతోపాటు కనీసం 2,500 జనాభాకు లేదా 5 కి.మీ పరిధిలో ఒక సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను కూట‌మి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏజెన్సీల్లో అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు. సచివాలయంలో జ‌న‌వ‌రి 10వ తేదీన (శుక్రవారం) గ్రామ, వార్డు సచివాలయాలశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు.

☛➤ TGPSC No Jobs Notifications 2025 : ఇక‌పై 6 నెల‌ల వ‌ర‌కు ఉద్యోగ‌ నోటిఫికేష‌న్లు లేవ్‌... కార‌ణం ఇదే...!

గతంలో ప్రతిపాదించిన ప్రకారం 1.61 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కానీ 1.27 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వీరిలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారికి శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్‌ కార్యదర్శులుగా నియమించాలి. వీరి ద్వారా ఏఐ, డ్రోన్‌ వంటి కొత్త సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి. ప్రతి ఇంటినీ జియోట్యాగింగ్‌ చేయాలి. జనవరి 20 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని సూచించారు.

➤☛ APPSC New Exams Time Table 2025 : ఈ 8 ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌ల‌కు పరీక్షల‌ తేదీలు ప్ర‌క‌ట‌న‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?

గ్రామ‌/వార్డు సచివాలయాల్లో ప్రజల సమస్త సమాచారం అందుబాటులో ఉండాలి. నెలాఖరు నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాల‌న్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు రియల్‌టైం గవర్నెన్స్‌ కార్యాలయాలుగా పనిచేయాలి. పంచాయతీ కార్యదర్శి/వార్డు పరిపాలన కార్యదర్శి సచివాలయ అధిపతిగా ఉంటారు. సచివాలయాలు నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అభివృద్ధి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి, విలువ జోడింపు వంటి వాటికి కేంద్రాలుగా ఉండాలి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలి. సచివాలయాల ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలి.

Published date : 11 Jan 2025 01:42PM

Photo Stories