Skip to main content

Jobs: రవాణా శాఖకు కొత్తగా 95 పోస్టులు

ఇప్పటికే ఉన్న పోస్టులతో పాటు అదనపు పోస్టులను మంజూరు చేయాలన్న Department of Transport ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Jobs
రవాణా శాఖకు కొత్తగా 95 పోస్టులు

కొత్తగా 95 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులకు అదనంగా ఈ కొత్త పోస్టులను మంజూరు చేసింది. గత 30 ఏళ్లలో రవాణా శాఖకు ఇన్ని పోస్టులను కేటాయించడం ఇదే తొలిసారి. వాటిలో అధికారుల స్థాయి పోస్టులు 24 కాగా క్లరికల్‌ పోస్టులు 71 ఉన్నాయి. అధికారుల స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. వాటిలో జాయింట్‌ కమిషనర్‌ పోస్టులు 4, ఉప రవాణా కమిషనర్‌ పోస్టులు 2, ఆర్‌టీవో పోస్టులు 15, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 3 ఉన్నాయి. ఇక మిగిలిన 71 క్లరికల్‌ కేడర్‌ పోస్టులను కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. పదోన్నతుల ద్వారా పోస్టుల భర్తీ ప్రక్రియకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. క్లరికల్‌ పోస్టుల భర్తీ కోసం APPSC రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ నిర్వహిస్తుంది. 

చదవండి: 

Published date : 07 Sep 2022 05:04PM

Photo Stories