560 Jobs: ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
Sakshi Education
రాష్ట్రంలో 560 Extension Officer(గ్రేడ్–2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు అట్టాడ సిరి సెప్టెంబర్ 5న విడుదల చేశారు.
ప్రభుత్వం ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే కాంట్రాక్టు వర్కర్లు, సూపర్‌వైజర్లతో 560 పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. అర్హులైన వారు సెప్టెంబర్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హాల్‌టికెట్లు జారీ చేసి.. 18వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని నాలుగు జోన్లు(విశాఖ, ఏలూరు, ఒంగోలు, కర్నూలు) పరిధిలో.. నిర్దేశించిన కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుందని సిరి పేర్కొన్నారు.
చదవండి:
Published date : 07 Sep 2022 04:51PM