Skip to main content

Andhra Pradesh: సర్కారు వరం.. వారంతా ఇక పర్మినెంట్‌ ఉద్యోగులు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్ల కల నెరవేరింది. వారి జీవితాల్లో పండుగ వచ్చింది.
Andhra Pradesh
సర్కారు వరం.. వారంతా ఇక పర్మినెంట్‌ ఉద్యోగులు

జేఎల్‌ఎం గ్రేడ్‌–2 ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల మేరకు అర్హత గల అందరినీ పర్మినెంట్‌ (రెగ్యులర్‌) చేస్తూ ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఆగ‌స్టు 3న‌ ఉత్తర్వులిచ్చారు.

చదవండి: AP Grama Ward Sachivalayam Jobs 2023 : గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల విష‌యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. తాజా షెడ్యూల్ ఇదే..

సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా వారి జీతభత్యాలుంటాయని ఆదేశాల్లో వెల్లడించారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి నిరుద్యోగులకు వరంలా అందించింది.

ఏపీ ఈపీడీసీఎల్‌లో దాదాపు 2,859 మంది, ఏపీ సీపీడీసీఎల్‌లో 1,910 మంది, ఏపీ ఎస్పీడీసీఎల్‌లో 3,114 మంది చొప్పున మొత్తం 7,883 మందికి ఉద్యోగం కల్పించింది.  వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుందని సీఎండీలు తెలిపారు.

చదవండి: Grama ward sachivalayam: ఇక‌పై వాట్సాప్‌లో స‌చివాల‌యాల సేవ‌లు... ఏపీలో మ‌రో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం

Published date : 04 Aug 2023 01:38PM

Photo Stories