AP Grama Ward Sachivalayam Jobs 2023 : గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. తాజా షెడ్యూల్ ఇదే..
అటువంటివారి దరఖాస్తులు, వాటితోపాటు సమర్పించే వైద్యుల సర్టిఫికెట్లను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. జిల్లాలో బదిలీలు, అంతర్ జిల్లా బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాలయాలశాఖ జూన్ 8వ తేదీన (గురువారం) విడుదల చేసిన తాజా షెడ్యూల్ ఇలా ఉంది.
సొంత జిల్లాల్లోనే..
బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ బదిలీలకు సొంత జిల్లాల్లోనే మరో స్థానానికి బదిలో కోరుతూ 13,105 మంది, ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీ కోసం మరో 2,421 మంది దరఖాస్తు చేసుకున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే.
☛ AP Grama/Ward Sachivalayam : ఈ మార్కుల ఆధారంగానే.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు..
వీరికి ప్రభుత్వం ఈ ఏడాది బదిలీలకు అవకాశం కల్పించింది. బదిలీలకు జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా పరిధిలో, అంతర్ జిల్లాల బదిలీలకు కలిపి మొత్తం 15,526 మంది దరఖాస్తు చేసుకున్నారు. బదిలీలకు అర్హత ఉన్న వారికి జూన్ 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న మేరకు కేటాయించే సచివాలయాల వివరాలతో ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా పోస్టుల్లోనే..
అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 1,581 మంది బదిలీ కోరుతూ దరఖాస్తు చేశారు. ప్రత్యేకించి ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 233 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాత గుంటూరు జిల్లా నుంచి 232 మంది దరఖాస్తు చేసినట్టు అధికారులు వివరించారు. అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు 1,976 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు బదిలీ కోరుతూ అత్యధికంగా మహిళా పోలీసులు 389 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఎక్కువ మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.
అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ ఇదే..
☛ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28
☛ బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3
☛ దరఖాస్తులను సంబంధిత జిల్లాకు పంపేందుకు గడువు: జూన్ 9
☛ జిల్లా అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి
☛ దరఖాస్తుల సమర్పణ: జూన్ 10
రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి..
☛ దరఖాస్తులు కార్యదర్శికి సమర్పణ: జూన్ 13
☛ బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ: జూన్ 14, 15
☛ కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి
జిల్లాలో ఉద్యోగులన బదిలీల షెడ్యూల్ ఇదే..
☛ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28
☛ బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3
☛ దరఖాస్తుల పరిశీలనకు తుది గడువు : జూన్ 10
☛ Andhra Pradesh: 63 CDPO ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. అలాగే ఈ పోస్టులను కూడా..
☛ కేటాయించిన మండలాలు,మున్సిపాలిటీలు,
తిరస్కరించిన దరఖాస్తుల జాబితా ప్రకటన : జూన్ 12
☛ బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ : జూన్ 14, 15
☛ కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి
☛ Andhra Pradesh: గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల.. శాలరీ ఎంతంటే..?