AP Grama/Ward Sachivalayam Employees : గుడ్‌న్యూస్.. వీటి ఆధారంగానే.. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు..
పరస్పర అంగీకార బదిలీలతో పాటు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వోద్యోగులై ఉండి వేర్వేరుచోట్ల పనిచేస్తున్న వారికి.. ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికి మాత్రమే ఈ ఏడాది గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను పరిమితం చేయాలని ఆ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
ఒకే జిల్లా పరిధిలో బదిలీలకు..
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఈ బదిలీల ప్రక్రియను నిర్వహిస్తూ.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, అలాగే ఒకే జిల్లా పరిధిలో బదిలీలకు సైతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు. 2019లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి, కేవలం నాలుగు నెలల కాలంలోనే కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల వీరికి వేతనాలు కూడా ప్రభుత్వం పెంచింది. అప్పట్లో ఈ ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు మూడున్నరేళ్లలోపు సర్విసును పూర్తిచేసుకున్నారు.
☛ Andhra Pradesh: 63 CDPO ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. అలాగే ఈ పోస్టులను కూడా..
విధి విధానాలు.. :
ఈ ఏడాది సాధారణ ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులకు కూడా తొలిసారి బదిలీలకు అవకాశం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విధివిధానాల ఖరారుపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మంగళవారం ఆ శాఖ అధికారులతో ఈ విషయమై సమీక్షించారు. వివిధ సచివాలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయి వారి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు.
Andhra Pradesh: గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల.. శాలరీ ఎంతంటే..?
ఈ మూడు అంశాల ప్రాతిపదికనే ఈసారి బదిలీలు..
ఇక సాధారణ వినతి మేరకు బదిలీలకు అవకాశం కల్పిస్తే.. మారుమూల గిరిజన ప్రాంతాలతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులందరూ బదిలీలు కోరుకుంటారని.. దీంతో ఇబ్బందులు ఏర్పడే అవకాశమున్నందున ఆ తరహా బదిలీలను పూర్తిగా కట్టడి చేయాలని గ్రామ,వార్డు సచివాలయాల శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో పరసర్ప అంగీకారం, భార్యాభర్తల అంశం, మెడికల్ గ్రౌండ్.. ఈ మూడు అంశాల ప్రాతిపదికన ఈసారి బదిలీలకు పరిమితం కావాలని నిర్ణయించారు. వీటి ప్రాతిపదికన కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారికే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
సొంత గ్రామానికి ఎట్టి పరిస్థితిలోనూ..
భార్యాభర్తల ప్రాతిపదికన కూడా ఇద్దరూ ప్రభుత్వోద్యోగులైతేనే (కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఏ విభాగమైనా) పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే, ఉద్యోగి సొంత గ్రామానికి ఎట్టి పరిస్థితిలోనూ బదిలీ చేయరు. ఇక ఈ బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను సిద్ధం చేయనున్నారు.
పెరిగిన జీతాలు ఇలా..
గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్టేటివ్ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకుంటారు. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి.
గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు రూ.22,120 - రూ.74,770పే స్కేలును అమలు చేయనున్నారు. డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రేడ్-2 అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వీఆర్వో, వెల్ఫేర్ అసిస్టెంట్ల వేతన శ్రేణి రూ.22,460 - రూ.72,810 మధ్య ఉండనుంది.
☛ AP Grama/Ward Sachivalayam : ఈ మార్కుల ఆధారంగానే.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు..
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి ఉద్యోగులకు రూ.23,120 - రూ.74,770 వేతనం చెల్లించగా.. మిగిలిన వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్-డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీలకు పే స్కేలు రూ. 22,460- రూ.72,810 మధ్య ఉండనుంది.