Skip to main content

APPSC: ఏఈ పోస్టులకు ఎంపికైనవారి జాబితా విడుదల

రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని ఇంజనీరింగ్‌ సర్వీస్‌లకు సంబంధించిన Assistant Engineer (AE) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైనవారి జాబితాను APPSC ఆగస్టు 3న విడుదల చేసింది.
Release of list of selected for AE posts
ఏఈ పోస్టులకు ఎంపికైనవారి జాబితా విడుదల

ఎంపికైన వారి వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌ ‘https://psc.ap.gov.in’లోఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

చదవండి: ఏవిధమైన కోచింగ్ లేకుండానే.. గ్రూప్-1 కొట్టానిలా..

అసిస్టెంటు పోస్టుల పరీక్షకు 77.42 శాతం మంది హాజరు

రాష్ట్రంలోని రెవెన్యూ విభాగంలోని జూనియర్‌ అసిస్టెంటు కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంటు పోస్టుల భర్తీకి జూలై 31న నిర్వహించిన పరీక్షకు 77.42 శాతం మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షకు 3,86,195 మంది రిజిస్టర్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. వీరిలో 2,73,166 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, 2,11,495 మంది హాజరయ్యారని వివరించారు. 

చదవండి: పేపర్ వేసే కుర్రాడు.. సెలబ్రిటీ అయ్యాడిలా..

దరఖాస్తు గడువు 30 

రాష్ట్రంలోని ఆలిండియా సర్వీసు, ఏపీ సర్వీసు అధికారులకు నిర్వహించే లాంగ్వేజ్, ఇతర పరీక్షలకు సంబంధించి దరఖాస్తులను ఆగస్టు 30వ తేదీలోగా దాఖలు చేయవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు సెప్టెంబర్‌ 27 నుంచి 30వ తేదీవరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ ఫారం, ఇతర సమాచారాన్ని కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన సూచించారు. 

చదవండి: తండ్రి కూరగాయాల వ్యాపారి.. కొడుకు అమెజాన్ కంపెనీలో పెద్ద ఉద్యోగం.. వీళ్ల స్టోరీ చూస్తే..

Published date : 04 Aug 2022 04:26PM

Photo Stories