Skip to main content

AP Inter Exams 2023 Results Link : బ్రేకింగ్ న్యూస్‌.. నేడే ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో ఫ‌లితాలు చూడొచ్చు.

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల తేదీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్ర‌క‌టించింది. ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప‌బ్లిక్‌ పరీక్షల ఫ‌లితాల‌ను ఏప్రిల్ 26వ తేదీ (బుధ‌వారం) సాయంత్రం 5:00 గంట‌ల‌కు ఒకే సారి విడుద‌ల చేయ‌నున్నారు.
ap intermediate results 2023 news telugu
ap intermediate results 2023 date and time

ఈ ఫ‌లితాల‌ను ఏపీ విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్ర‌ట‌రీ శేష‌గిరి బాబు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఏపీ ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప‌బ్లిక్‌ పరీక్షల ఫ‌లితాల‌ను https://results.sakshieducation.com లో చూసుకోవచ్చు.

TS Inter Exams 2023 Results : టీఎస్ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల ఎప్పుడంటే..?

ఫ‌లితాల కోసం 10,03,990 మంది విద్యార్థులు ఎదురుచూపు..

ts inter results 2023 link

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు–2023 మార్చి 15వ తేదీన‌ ప్రథమ సంవత్సరం, 16వ తేదీన‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజ‌ర‌య్య‌రు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ ప్ర‌క్రియ‌ను అత్యంత త్వ‌ర‌గా ముగించింది. తెలంగాణ‌లో కంటే ఏపీలో ముందుగా ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.     

వీరి 2 మార్కులు : 

ts inter students marks

మార్చి 27వ తేదీన జ‌రిగిన ఇంట‌ర్‌ సెకండియర్ ఫిజిక్స్ పరీక్షలో.. ఇంగ్లిష్ మీడియం పేపర్లో తప్పులు దొర్లినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలపుతామని బోర్డు ప్రకటించింది. ఫిజిక్స్ పేపర్ 2లోని మూడో ప్రశ్న తప్పుగా ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది.

Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

ఏపీ ఇంటర్‌ తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో 3వ ప్రశ్నగా ఆయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వచించుము..? అని రాగా.. ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో డిఫైన్ మ్యాగ్నటిక్ డెక్లినేషన్ అని తప్పుగా ప్రచురితమైంది. దానికి బదులుగా డిఫైన్ మ్యాగ్నటిక్ ఇన్‌క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని రావాల్సి ఉంది. ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

➤☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప‌బ్లిక్‌ పరీక్షల ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప‌బ్లిక్‌ పరీక్షల ఫ‌లితాల పూర్తి వివ‌రాలు ఇవే..

ts inter details news telugu
Published date : 26 Apr 2023 07:55AM

Photo Stories