AP Inter Results 2022 Link: నేడే ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు.
How to check AP Inter 1st Year 2022 Results:
☛ Visit results.sakshieducation.com or education.sakshi.com
☛ Click on AP Inter 1st year results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.
How to check AP Inter 2nd Year 2022 Results:
☛ Visit results.sakshieducation.com or education.sakshi.com
☛ Click on AP Inter 1st year results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.
10.01 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం..
ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 24వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది.
ఈ సారి ఇంటర్ పరీక్షల్లో..
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ 2022–23 విడుదల..
మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొంది. 2023 ఏప్రిల్ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు స్పష్టం చేశారు. అడ్మిషన్ల కోసం ప్రకటనలు ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయరాదని పేర్కొన్నారు.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ 2022–23 ఇలా..
కాలేజీల ఓపెనింగ్ |
జూలై 1 |
త్రైమాసిక పరీక్షలు |
సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు |
దసరా సెలవులు |
అక్టోబర్ 2 నుంచి 9 వరకు |
కాలేజీల రీఓపెన్ |
అక్టోబర్ 10 |
అర్ధసంవత్సర పరీక్షలు |
నవంబర్ 14 నుంచి 19 వరకు |
సంక్రాంతి సెలవులు |
2023 జనవరి 11 నుంచి 17 వరకు |
రీ ఓపెనింగ్ |
జనవరి 18 |
ప్రీఫైనల్ పరీక్షలు |
జనవరి 19 నుంచి 25 వరకు |
ప్రాక్టికల్ పరీక్షలు |
ఫిబ్రవరి 8 నుంచి 28 వరకు |
థియరీ పరీక్షలు |
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు |
చివరి పనిదినం |
ఏప్రిల్ 21 |
వేసవి సెలవులు |
ఏప్రిల్ 22 నుంచి మే 31 వరకు |
అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు |
2023 మే చివరి వారంలో |