Skip to main content

Intermediate Public Exams 2024: ఇంటర్మీడియెట్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ సమూలమైన మార్పులు

ఇంటర్మీడియెట్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ సమూలమైన మార్పులు
ఇంటర్మీడియెట్‌  స్పాట్‌ వాల్యూయేషన్‌  సమూలమైన మార్పులు
ఇంటర్మీడియెట్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ సమూలమైన మార్పులు

గుంటూరు : ఇంటర్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియలో ప్రభుత్వం సమూలమైన మార్పులు చేసింది. ఇటీవల పబ్లిక్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాల స్పాట్‌ వాల్యూయేషన్‌ (మూల్యాంకనం) ప్రస్తుతం జరుగుతోంది. స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల్లో ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను మూల్యాంకనం చేస్తున్న ఎగ్జామినర్లతోపాటు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న చీఫ్‌ ఎగ్జామినర్లు విద్యార్థులకు మార్కులను కేటాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థుల ఆన్సర్‌ స్క్రిప్ట్‌లకు అన్ని జిల్లాల్లోనూ స్పాట్‌ క్యాంప్స్‌ నడుస్తున్నాయి. జిల్లాల వారీగా స్పాట్‌ వాల్యూయేషన్‌ చేసిన ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను ఇంటర్మీడియెట్‌ బోర్డుకు పంపడంతో అధికారుల బాధ్యత పూర్తవుతోంది.

బోర్డుకు వెళ్లిన ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కాన్‌ చేసి విద్యార్థుల వారీగా రోల్‌ నంబరు, ప్రశ్నపత్రంతో ఇచ్చిన ప్రత్యేక సీరియల్‌ నంబరు, బార్‌కోడ్‌ ఆధారంగా మార్కులను కేటాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కానింగ్‌చేసి మార్కులను కేటాయిడం ఒక్క బోర్డు ప్రధాన కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉండటంతో అధికారులకు, ఉద్యోగులకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పగలు, రాత్రి విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ మార్కుల వెల్లడిలో జాప్యం నెలకొంటోంది. ఈ విషయమై దృష్టి సారించిన ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది. విద్యార్థుల ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కానింగ్‌ చేసే ‘‘మార్క్స్‌ ట్యాబ్లేషన్‌’’ విధానాన్ని వికేంద్రీకరణ చేస్తూ, జిల్లాల వారీ స్పాట్‌ కేంద్రాల్లోనే ఏర్పాట్లు చేసింది.

Published date : 23 Mar 2024 02:39PM

Photo Stories