Handlooms Textile Diploma Course Admissions 2024: హ్యాండ్లూమ్స్ టెక్స్‌టైల్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
మచిలీపట్నం: డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ జిల్లా అధికారి కె. అప్పారావు గురువారం ఓ ప్రకటనలో కోరారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో 15 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదో తరగతి, తత్సమానమైన పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
Also Read: Download IIT JEE Advanced Admit Card 2024
ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్‌లో పాసైన విద్యార్థులకు, పదో తరగతితో పాటు ఐటీఐ రెండు సంవత్సరాలు పాసైన వారికి సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సునకు ప్రవేశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలని, కోర్సు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 1000, సెకండ్ ఇయర్‌లో నెలకు రూ. 1100, మూడో సంవత్సరంలో రూ.1200 స్టైఫండ్ ఇస్తారన్నారు. వెంకటగిరిలోని కళాశాలలో 53 సీట్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9399936872, 9866169908లో సంప్రదించాలన్నారు. దరఖాస్తులు జూన్ 1వ తేదీలోగా ఆన్‌లైన్ చేయాలని ఈ అవకాశాన్ని సంబంధిత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.