Skip to main content

APBIE: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లు సిద్ధం

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల (థియరీ) 2023కు సంబంధించిన హాల్‌ టికెట్లను విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు మే 19న ఒక ప్రకటన విడుదల చేసింది.
APBIE
ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లు సిద్ధం

ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల జ్ఞానభూమి లాగిన్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకొనే సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. జనరల్‌  వొకేషనల్‌ ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల హాల్‌ టికెట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు ఈ విషయాన్ని వారి జిల్లాలలోని అన్నీ కాలేజీల ప్రిన్సిపాళ్లకు  తెలియజేయాలని ఇంటర్మీడియెట్‌  విద్యామండలి సెక్రటరీ ఎం.వి.శేషగిరిబాబు ఆదేశించారు.  

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

Published date : 20 May 2023 03:03PM

Photo Stories