Intrermediate: ‘అడ్వాన్స్’ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. చివరీ తేదీ ఇదే..
షెడ్యూల్ ప్రకారం గడువు 8వ తేదీ వరకు మాత్రమే ఉండగా బోర్డు దాన్ని 3 రోజులు పాటు పొడిగించింది.
చదవండి: Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!
కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలి
ఎయిడెడ్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ రెండో షెడ్యూల్ విడుదల చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,300 మంది ఎయిడెడ్ సిబ్బంది ఉన్నారని, వీరికి రెండో విడత కౌన్సెలింగ్ విధి విధానాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ కొలువు
జేఎల్ ప్రమోషన్లను కల్పించాలి: ఫోర్టో
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న హైస్కూల్ ప్లస్ 2 పాఠశాలల్లో పీజీటీ బదులుగా జేఎల్ ప్రమోషన్స్ కల్పించాలని ఫోర్టో ఛైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామల సింహాచలం, ముఖ్య సలహాదారులు గాండ్లపర్తి శివానందరెడ్డి, మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్ జూలై 8న విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా బాలికల కోసం 292 ఉన్నత పాఠశాలలను ప్లస్ 2గా అప్‌గ్రేడ్ చేయడం బాలికలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. విద్యాశాఖ నిర్వహించే సమావేశాలకు అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించాలని కోరారు.