Skip to main content

AP 10th Supplementary Exams Results : టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల విడుద‌లయ్యాయి. ఈ ఫ‌లితాల‌ను ఆగ‌స్టు 3వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేశారు.
AP 10th Supplementary Exams Results
AP 10th Supplementary Exams Results

ఈసారి 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జూలై 6 నుంచి 15 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఫలితాలను www.sakshieducation.com లో చెక్‌ చేసుకోవచ్చు.

టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి

How to check AP SSC Advanced Supplementary Results 2022?

  • Visit results.sakshieducation.com or sakshieducation com
  • Click on AP SSC Supplementary results 2022 on the home page
  • Enter your hall ticket number in the results page.
  • Click on submit button
  • The results will be displayed 
  • Download a copy for further use

అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే..
టెన్త్‌  సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.. 191800 మంది పరీక్షలు రాశారు. బాలురులో పాసైన వారి సంఖ్య 66458 ఉత్తీర్ణతా శాతం 60.83 శాతం. పాసైన బాలికల సంఖ్య 56678. ఉత్తీర్ణత శాతం 68.76 శాతం. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు.
చదవండి: మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్‌.. 4 రోజులు తిరక్కముందే

ఈ‌ ఒక్క సంవత్సరమే ఇలా..
రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకుని మొత్తంగా పదవ తరగతి పరీక్షలకి 6,06,070 పరీక్షలకి హాజరు కాగా.. 5,37,491 మంది ఉత్తీర్ణతా సాధించారు. మొత్తంగా ఉత్తీర్ణతా శాతం 88.68. ఈ‌ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైన‌వారిని రెగ్యులర్ పాస్‌గా పరిగణిస్తామని, కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగానే..

ఈ పరీక్షల్లో పాసయ్యే వారిని కంపార్ట్‌మెంటల్‌ అని కాకుండా రెగ్యులర్‌ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్‌ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గ‌తంలో మెమో జారీ చేశారు. ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ సడలింపు వర్తించనుందని పేర్కొన్నారు. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా స్కూళ్లు సరిగా నడవకపోవడం, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారు చాలా వెనుకపడ్డారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేకపోయిన విష‌యం తెల్సిందే.

Published date : 03 Aug 2022 11:06AM

Photo Stories