Skip to main content

No Traffic: ట్రాఫిక్‌ ఇ‍బ్బందులు లేకుండా

విద్యార్థులకు పరీక్ష కేంద్రా‍ల్లోనే కాకుండా కేంద్రానికి చేరే పరిధిలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆదేశించారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు..
'No Traffic' during Tenth Class Board Exams 2024

తుమ్మపాల: పరీక్షలకు హాజరయ్యే టెన్త్‌ విద్యార్థులకు ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు గొండు సీతారాం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి 30 వరకు జరగనున్న పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

Collector Gautami: 'టెన్త్‌ విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌'.. కలెక్టర్‌

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్మన్‌ కేసలి అప్పారావు ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాలో పోలీసులకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. తల్లిదండ్రులతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళుతున్న సమయంలో కేసులు బుక్‌ చేయడం, ఆకస్మికంగా వాహనాల ఆపడం తదితర చర్యలు చేపట్టవద్దని సూచించారు. జిల్లాలో పోలీసులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సీతారాం సూచించారు.

Published date : 17 Mar 2024 04:55PM

Photo Stories