Skip to main content

Collector Gautami: 'టెన్త్‌ విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌'.. కలెక్టర్‌

ఈనెల 18న జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ గౌతమి విద్యార్థులను సందర్శించి వారిని పరీక్ష కోసం ప్రోత్సాహించారు..
Collector Greetings to Tenth Class Students for their Public Exams

అనంతపురం అర్బన్‌: మనసును ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయండి.. ఆల్‌ ది బెస్ట్‌.’ అంటూ కలెక్టర్‌ గౌతమి పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 142 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 40,063 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు.

APPSC Group-1 Prelims Question Paper with Key 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2024 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు

విద్యార్థులు ఉదయం 8.40 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుస్తాయని, హాల్‌ టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఫిర్యాదులు, సందేహాల నివృత్తి, సమాచారం కోసం 9441575778, 94405 94773 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పరీక్షలు ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయని కలెక్టర్‌ తెలిపారు.

Published date : 17 Mar 2024 12:31PM

Photo Stories