Skip to main content

Tenth Class Students: పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా.. సాధన చేయాలి

గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థులతో సమావేశమై వారిని పరీక్షలకు ప్రోత్సాహించారు. పాఠశాలలో ఆయన మాట్లాడుతూ..
DEO Brahmaji speaking to the school teachers about tenth exams

అనంతగిరి: టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు.

☛ Tenth Class Exams 2024: పరీక్ష హాల్‌లో ఒత్తిడికి గురికావొద్దు... ఈ చిట్కాలు పాటించి ఒత్తిడిని జయించండి!

 Germany Representatives: అంబేడ్కర్‌ స్తూల్‌ను సందర్శించిన జర్మనీ ప్రతినిధులు

అనంతరం మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో ఆయన సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజన పథకం ప్రతి పాఠశాలలో పక్కాగా అమలు చేయాలని సూచించారు. నాడు–నేడు పనులను పర్యవేక్షించాలని, ప్రతిరోజు ముఖ ఆధారిత హాజరు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని ఎంఈవో బాలాజీ పాల్గొన్నారు.

 APPSC Job Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

 TS 10th Class Hall Tickets 2024 Download : టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

Published date : 06 Mar 2024 05:57PM

Photo Stories