School Inspection: పాఠశాలలో ఆకస్మిక తనిఖీ..!
కై కలూరు/కలిదిండి: పబ్లిక్ పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని డీఈఓ ఎస్.అబ్రహం అన్నారు. కైకలూరు మండలం గోపవరం, శీతనపల్లి ఎంపీయూపీ స్కూళ్లు, దొడ్డిపట్ల హైస్కూల్, కలిదిండి మండలం కలిదిండి, ఆరుతెగళపాడు, కోరుకొల్లు హైస్కూళ్లను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోపవరంలో లెక్కల సిలబస్ పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
Teacher Srinivas: విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలో ఈ పని చేసిన ఓ ఉపాధ్యాయుడు
కోరుకొల్లు హెచ్‌ఎస్‌లో ఇంటరాక్టీవ్ ప్లాట్ ప్యానల్(ఐఎఫ్‌పీ) ఉపయోగించకపోవటంపై ఉపాధ్యాయులను మందలించారు. డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావ్యవస్థకు ఎంతో ప్రాధాన్యమిస్తోందన్నారు. బైజూస్ ట్యాబ్‌లు విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల హాజరు, సబ్జెక్టు వారీగా పాఠాలు పూర్తి వంటి వివరాలు తెలుసుకున్నారు. కలిదిండి ఎంఈఓ పీపీ ప్రభాకర్‌రావు, హెచ్‌ఎంలు ఉన్నారు.
Education News: విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలోచన.. జెడ్పీ హైస్కూల్లో వలంటీర్ వ్యవస్థ