Andhra Pradesh: విద్యాభివృద్ధికి విశేష కృషి
రంపచోడవరం సమీపంలోని పెదగెద్దాడ వద్ద రూ. 1.20 కోట్లతో నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవనానికి గరువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో అనేక మౌలిక వసతులు కల్పించారని, కొత్త భవనాలు నిర్మించినట్టు తెలిపారు.
విద్యతోనే కుటుంబాలు ఆర్ధికాభివృద్ధి సాధిస్తాయన్నారు. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్ధలో అనేక మార్పులు చేశారన్నారు.
చదవండి: National Children's Science Congress 2023: పిల్లలను పరిశోధనల వైపు ప్రోత్సహించాలి
ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ పండా కుమారి, సర్పంచ్ వడగల ప్రసాద్, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, ముచ్చిక సాయిబాబా,తుర్రం వెంకటేశ్వర్లుదొర, అన్నవరం డైరెక్టర్ కారుకోడి పూజ, నాయకులు రామకృష్ణదొర, మాజీ ఎంపీపీ సత్యనారాయణరెడ్డి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రంపచోడవరం మండలం వెట్టిచెలకలు, దబ్బవలస గ్రామాల్లో వాలీబాల్ కిట్లును ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్యే అనంతబాబులు అందజేశారు. వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో క్రికెట్, వాలీబాల్ క్రీడలపై ఆసక్తి ఉన్న, వారి వద్ద క్రీడ సామాగ్రి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడం గుర్తించి వారి కిట్లును పంపిణీ చేశామన్నారు.క్రీడల్లో యువతను ప్రోత్సాహించేందుకు తమ కృషి చేస్తామన్నారు.