Skip to main content

టీచర్ల అటెండెన్స్‌ యాప్‌లో ఇబ్బందుల పరిష్కారం

ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరు నమోదుపై ఆన్‌లైన్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ పరిష్కరించింది.
Teachers Attendance App
టీచర్ల అటెండెన్స్‌ యాప్‌లో ఇబ్బందుల పరిష్కారం

ఈ మేరకు టీచర్ల అటెండెన్స్‌ యాప్‌లో మార్పులు చేసింది. ఈ యాప్‌ ద్వారా ఉపాధ్యాయుల హాజరును గుర్తించడంలో మొబైల్‌ అప్లికేషన్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి సవరించిన మార్గదర్శకాలను ఆగస్టు 21న జారీచేసింది.

చదవండి: Best Teacher Awards: దరఖాస్తుల ఆహ్వానం

దీని ప్రకారం.. 

టీచర్లు పాఠశాలలో ప్రతి పనిదినం ఉ.9గంటలకు ముందు తమ హాజరు నమోదు చేయాలి. ప్రస్తుత విధానం ప్రకారం టీచర్ల హాజరును గుర్తించడానికి 10 నిమిషాలు గ్రేస్‌టైమ్‌గా పరిగణిస్తారు. నెట్‌వర్క్‌ సమస్యల కారణంగా హాజరును గుర్తించలేని టీచర్ల కోసం ఆఫ్‌లైన్‌లో హాజరును గుర్తించడానికి యాప్‌లో తగిన సదుపాయం అందుబాటులో ఉంచింది. ఆఫ్‌లైన్‌లో హాజరు క్యాప్చర్‌ అవుతుంది. అనంతరం నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్నప్పుడు అది సింక్రనైజ్‌ అవుతుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లేని టీచర్లు హెడ్మాస్టర్‌ లేదా ఇతర టీచర్ల మొబైల్స్‌ద్వారా తమ హాజరును నమోదు చేయవచ్చు. సెలవు మాడ్యూల్‌లో మార్కింగ్‌ డిప్యుటేషన్‌/శిక్షణ/విధి నిర్వహణల నిబంధన అమలవుతుంది. ఈ మాడ్యూల్‌ 25న విడుదల అవుతుంది. హెడ్మాస్టర్లు, టీచర్లు ఏకీకృత హాజరు మొబైల్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసి, నమోదు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సురేష్‌కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

చదవండి: 

Published date : 22 Aug 2022 01:27PM

Photo Stories