స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
రాష్ట్రంలో 2022–23 విద్యా సంవత్సరంలో జరగనున్నNational Means-cum-merit Scholarship (NMMS) పరీక్షకు 8వ తరగతి చదువుతోన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు.
ఈ పరీక్షకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. పరీక్ష రుసుమును ఓసీ,బీసీ విద్యార్థులకు రూ.100గా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50గా నిర్ణయించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 30 నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తు, పరీక్ష రుసుము సమర్పణకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. పరీక్ష రుసుమును ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. పూర్తి వివరాలను https://scholarships.gov.in లో పొందుపరిచారు.
చదవండి:
Scholarships: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు..
Published date : 01 Oct 2022 01:31PM