Skip to main content

Scholarships: స్టెమ్‌ విద్యార్థినులకు ఆకాంక్ష స్కాలర్‌షిప్‌

సాఫ్ట్‌వేర్‌ మౌలిక వసతుల రంగంలో పేరొందిన ‘ప్రోగ్రెస్‌’ సంస్థ భారత్‌ లోని Science and Technology, Engineering, Mathematics (స్టెమ్‌) రంగాలకు చెందిన విద్యార్థినులకు ‘2022 ప్రోగ్రెసివ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆకాంక్ష స్కాలర్‌షిప్‌’ ను ప్రకటించింది.
Scholarships
స్టెమ్‌ విద్యార్థినులకు ఆకాంక్ష స్కాలర్‌షిప్‌

20 21లో స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం కాగా, ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థిను లకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.1.60 లక్షల వరకు అందుతుంది. ట్యూషన్‌ ఫీజు, చదువు కయ్యే ఇతర ఖర్చుల కోసం విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని ఉపయోగించు కోవచ్చు. Computer Science, Computer Information Systems, Software (IT) Engineering కోర్సులు చదువుతున్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హులు. 2021 ఆకాంక్ష స్కాలర్‌ షిప్‌కు రాష్ట్రం నుంచి కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థిని అఖిల కరణం ఎంపికైంది. స్కాలర్‌షిప్‌ కోసం విద్యా ర్థినులు ఆగస్టు 22 సాయంత్రం 5 గంటల లోగా ప్రోగ్రెస్‌ సాఫ్ట్‌వేర్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌లో అవార్డులకు అర్హులైన వారి జాబితాను ప్రోగ్రెస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రకటిస్తుంది.

చదవండి: 

Published date : 18 Aug 2022 01:38PM

Photo Stories