Skip to main content

Job Opportunities: ఆర్చ‌క పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Apply for Devadaya, Charity Department Posts  Announcement of written examination for priest posts in Andhra Pradesh  Notification for written examination for priests by Andhra Pradesh Devadaya and Dharmadaya department  Application details for priest posts in Andhra Pradesh

మ‌చిలీప‌ట్నంటౌన్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర దేవ‌దాయ‌, ధ‌ర్మ‌దాయ‌శాఖ ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లో అర్చ‌క పోస్టుల బ‌ర్తీకి నిర్వ‌హించ‌నున్న రాత ప‌రీక్ష‌కు అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు ఆ శాఖ మ‌చిలీప‌ట్నం స‌భాయ క‌మిష‌న‌ర్ నేల‌సంధ్య జూలై 19వ తేదీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. వైదిక స్వార్త‌, శైవ‌, పంచ‌రాత్ర‌, వైఖాన‌స‌, తంత్ర‌సార‌, వీర శైవ‌, చాత్తాద శ్రీ వైష్ణ‌వ‌, గ్రామ దేవ‌త ఆగ‌మ‌ముల‌లో ప్ర‌వేశ‌, వ‌ర‌, ప్ర‌వ‌ర స్థానాల‌కు ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. 

16 సంవ‌త్స‌రాలు నిండి, 5వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు గురువు వ‌ద్ద నుంచి లేదా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త చేసి ద‌రఖాస్తు చేసుకోవాల‌న్నారు. 40 సంవ‌త్స‌రాలు దాటిన వారికి రాత ప‌రీక్ష నుంచి మిన‌హాయింపు ఉంటుద‌న్నారు. వారు జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం జ‌త చేయాల‌న్నారు. ప‌రీక్ష రుసుము రూ.100గా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 63020 71530, 08645-273139లో సంప్ర‌దించాల‌న్నారు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 700 పోస్టులకు రేపు జాబ్‌మేళా

Published date : 22 Jul 2024 10:29AM

Photo Stories