Prime Minister E Education: త్వరలో డీటీహెచ్ చానల్స్‌లో పాఠాలు
‘ప్రధాన మంత్రి ఈ–విద్య’ డీటీహెచ్ చానల్స్‌లో టెలికాస్ట్ చేసేందుకు అవసరమైన కంటెంట్‌ను జూన్ 21న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ సమాన విద్యా అవకాశాలు అందుబాటులో ఉంచే ప్రక్రియలో భాగంగా 200 డైరెక్ట్ టు హోమ్ చానళ్లను రూపొందించి, ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తేనుంది.
చదవండి: One Class, One TV: సర్కారు బడుల్లో వన్ క్లాస్ – వన్ టీవీ
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్య కోసం ఐదు చానళ్లను కేటాయించింది. వీటి ద్వారా 2023–24 విద్యా సంవత్సరంలో 6 నుంచి 9 తరగతులకు ఒక్కో చానల్ చొప్పున, 3, 4, 5 తరగతులకు ఒక చానల్ కేటాయించినట్టు కమిషనర్ తెలిపారు. ఎస్సీఈఆర్టీ, పాఠశాల విద్య కమిషనర్ (ఇన్‌ప్రా) ఆధ్వర్యంలో 6, 7, 8, 9 తరగతుల భాషా విషయాల ఈ–కంటెంట్ రూపొందించామని, ప్రస్తుతం 8వ తరగతి కంటెంట్‌ను డీటీహెచ్ చానళ్లలో ప్రసార నిమిత్తం పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.