One Class, One TV: సర్కారు బడుల్లో వన్ క్లాస్ – వన్ టీవీ
ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా డిజిటల్ బ్యాంకు యూని ట్ సేవలను అక్టోబర్ 16న పారంభించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డీబీయూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద గిరిరెడ్డితోపాటు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల బ్యాంకు సేవలు డిజిటల్‌లో సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టార న్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన రూ.25లక్షల కోట్ల నగదును జన్‌ధన్ ఖాతాల ద్వారా అందించిందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ముద్ర రుణాల కింద రూ.2,750కోట్ల రుణాలను డిజిటల్ ద్వారా చెల్లించామని వెల్లడించారు.
చదవండి: Good News: వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంపు
నిధులు పక్కదారి పట్టకుండా ఉత్తరాది రాష్ట్రాలకు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చెల్లింపు ప్రక్రియ జరుగుతోందని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన ప్రధాని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో రూ.300కోట్ల స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు.
చదవండి: Moonlighting: మూన్‌లైటింగ్... అంటే ఏమిటి?.. తప్పా, ఒప్పా?