టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశా లల్లో పనిచేస్తున్న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ మేరకు Department of Tribal Welfare డైరెక్టర్ Gandham Chandrudu జూన్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం కేటగిరి–4లో పనిచేసిన వారికి ఏడాదికి 5 పాయింట్లు, కేటగిరి–3కి 3 పాయింట్లు, కేటగిరి–2కి 2 పాయింట్లు, కేటగిరి–1లో పని చేసిన వారికి 1 పాయింటు చొప్పున బదిలీల్లో వెయిటేజీ ఇస్తారు. జూన్ 17 నాటికి ఈ బదిలీలను పూర్తిచేయాలని.. ఇందుకు ఐటీడీఏ పీవోలు, డిప్యూటీ డైరెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సింహాచలం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ బదిలీల గడువును 10 రోజులు పొడిగించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వేంకటేశ్వర్లు, ప్రసాద్ డిమాండ్ చేశారు.
చదవండి:
Published date : 15 Jun 2022 01:22PM