Tribal Sports School: గిరిజన విద్యార్థులకు ప్రభుత్వ ప్రోత్సాహం
డిసెంబర్ 20న స్థానిక మాచర్ల రోడ్డులోని గిరిజన గురుకుల పాఠశాలలో థర్డ్ జోన్ గిరిజన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ.. చదువులో, క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన 17 పాఠశాలల నుంచి 1200 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు.
చదవండి: 10th Class Success Tips: ప్రతి రోజు బడి... హోమ్ వర్క్ తో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విజయం!
జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి పి.జగన్నాథరావు, ఓఎస్‌డీ ఎస్.శ్యాంసుందరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ ఏకుల జయమ్మ ముసలారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కె.ఓబులరెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్ సయ్యద్ జబీవుల్లా, ఏఎంసీ వైస్ చైర్మన్ కె.జయరావు, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, ఎంపీటీసీ మంగ్లిబాయి, ఎంఈవో పి.ఆంజనేయులు, ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు పి.సలాంఖాన్, శామ్యూల్ జోబ్, మోహన్, వెంకటేశ్వర్లు నాయక్, శివరామకృష్ణ, వేణుగోపాల్ పాల్గొన్నారు.
షాట్‌పుట్‌లో సీహెచ్ మధుకుమార్(నాగార్జునసాగర్) ప్రథమ, కె.వీరయ్య(యర్రగొండపాలెం) ద్వితీయ, బి.సాయినాయక్(దోర్నాల) తృతీయ స్థానాల్లో నిలిచారు. జావెలిన్‌త్రోలో వి.నాగేంద్ర నాయక్(గిద్దలూరు),ఆర్.వాసు(చిట్టేడు),ఇ.మహేష్ (చిట్టేడు), షాట్‌పుట్ బాలికల విభాగంలో ఐ.గీతిక(చీరాల), కె.శ్రీవల్లి(నెల్లూరు), ఎంజీ దీప్తి(నరసరావుపేట), లాంగ్‌జంప్ బాలికల విభాగంలో హర్షిణి(కారంపూడి), ఐ.హారతి(కరేడు), ఎం.విజయలక్ష్మి(పిడుగురాళ్ల), లాంగ్‌జంప్ బాలుర విభాగంలో ఇ.మహేష్(చిట్టేడు), సునోద్ నాయక్(అద్దంకి), టి.ముత్యాలయ్య(చిట్టేడు), బాలికల 800 మీటర్ల పరుగు పందెంలో బి.గంగోత్రి(కారంపూడి), ఆర్.పవిత్ర(కారంపూడి), జి.నీరజ(గిద్దలూరు) వరుస మూడు స్థానాల్లో సత్తా చాటారు.