Skip to main content

10th Class Success Tips: ప్రతి రోజు బడి... హోమ్ వర్క్ తో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విజయం!

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఎంఈఓ బాబ్జీ తెలిపారు.
Stress Management Techniques for AP 10th Class. Maintaining a Balanced Lifestyle for AP 10th Class Exams., AP 10th Class Guidance, Time Management for AP 10th Class Exams, Quality Study Materials for AP 10th Class,

పాకాల: తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను బాగా అర్థం చేసుకుని పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఎంఈఓ బాబ్జీ తెలిపారు.

మంగళవారం మండలంలోని ఓబులశెట్టివారిపల్లి ఉన్నత పాఠశాల, మద్దినాయనపల్లి, కొత్త ఒడ్డిపల్లి, వల్లివేడు, ఎంపీపీ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ప్రతీ రోజు తప్పకుండా తరగతులకు హాజరవ్వాలని, క్రమం తప్పకుండా ఇచ్చిన వర్క్‌ను పూర్తి చేయాలన్నారు.

Download AP 10th Class Free Model Papers TM EM

ఉపాధ్యాయులు విద్యార్థులు రాసిన నోట్‌బుక్కులను పరిశీలించి తప్పుఒప్పులను సరి చేయాలన్నారు. సకాలంలో సిలబస్‌ పూర్తి చేసి నోట్స్‌ను పిల్లలకు అందించాలన్నారు. పాఠశాలలో ఉండే స్మార్ట్‌ టీవీ, ఇంటరాక్టివ్‌ ప్యానల్‌ బోర్డ్స్‌ను ఉపయోగించుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు వెంకటరమణ, సుబ్బరామయ్య, వనజకుమారి, ఉపాధ్యాయులు, సీఆర్పీలు శ్రీనివాసులు, శివకుమారి పాల్గొన్నారు.

AP Tenth Class Physical Science Principles of Metallurgy(TM) Important Questions

Published date : 23 Nov 2023 10:54AM

Photo Stories