రాప్తాడు రూరల్: ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం 12(1)(సి) కింద 2023–24 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 257 మంది విద్యార్థులకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరామ్ తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలల్లో 257 మందికి ఉచిత ప్రవేశాలు
ఎంపికై న విద్యార్థుల జాబితాను ఏప్రిల్ 19న ఆయన విడుదల చేశారు. విద్యార్థులకు కేటాయించిన పాఠశాలల వివరాలు మండల విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు పంపినట్లు పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 19 నుంచి 25వ తేదీలోపు ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని సూచించారు.