Skip to main content

ఫార్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్షల తేదీలు

అసెస్‌మెంటు(ఎఫ్‌ఏ)–2 పరీక్షలు డిసెంబర్‌ 17 నుంచి నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ప్రకటించారు.
ఫార్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు
ఫార్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు

ఈ మేరకు రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లకు, డీఈవోలకు సర్క్యులర్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 20 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సమాధాన పత్రాలను డిసెంబర్‌ 18 నుంచి 21 వరకు మూల్యాంకనం చేయించాలని సూచించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ర్యాండమ్‌గా హెచ్‌ఎంలు, ఎంఈవోలు పరిశీలించాలని ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల సమాధాన పత్రాలను ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించాలన్నారు. పరిశీలన అనంతరం డిసెంబర్‌ 23 నుంచి 27లోపు విద్యార్థుల మార్కులను నిరీ్ణత పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థుల్లో లోపాల సవరణకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. 

చదవండి: 

IIIT: అడ్మిషన్ల పక్రియ ప్రారంభం

Police Department: ప్రభుత్వానికి కొత్త సర్వీస్‌ రూల్స్‌ను ప్రతిపాద‌న

Good News: సివిల్స్‌ కోచింగ్‌ దరఖాస్తు గడువు పెంపు

Published date : 25 Nov 2021 12:53PM

Photo Stories