‘పీఎం శ్రీ’కి ఐదు పాఠశాలలు
నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. పథకం కింద ఎంపికయ్యే హైస్కూళ్లకు 60:40 వాటాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను వెచ్చించనున్నాయి. పెద్దపల్లి జిల్లాలో కమాన్‌పూర్, అప్పన్నపేట, రామగుండం, ఎగ్లాస్‌పూర్, పొత్కపల్లి హైస్కూళ్లు పీఎం శ్రీ పథకానికి ఎంపికయ్యాయి.
ప్రత్యేకతలు ఇవీ..
పీఎం శ్రీ పథకంలో ఎంపికై న పాఠశాలలను ముందుగా కేంద్ర విద్యాశాఖ బృందాలు సందర్శిస్తాయి. నిర్ధేశిత ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ గ్రంథాలయాలు, క్రీడా సదుపాయాలు, ఆర్ట్ గదులు ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు నూతన జాతీయ విద్యావిధానంలో నిర్ధేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందేలా చూస్తారు. ఆయా స్కూళ్లలో కేంద్రం రూపొందించిన ప్రత్యేక కరిక్యులమ్(సిలబస్) అమలు చేస్తారు. సౌర విద్యుత్ ఏర్పాటు, కూరగాయ తోటలు, ప్లాస్టిక్ రహిత చర్యలు, శుద్ధజలం, ఇన్ఫర్మేటివ్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ల్యాబ్, ఇంటర్‌నెట్ సదుపాయం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
చదవండి:
Degree: యూజీ ఆనర్స్.. ఇక జాబ్ ఈజీ
TAFRC: త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!.. కారణం ఇదే
Disaster Management Authority: ట్రైనీ ఐఏఎస్‌లకు విపత్తుల నిర్వహణపై శిక్షణ
చదువు పూర్తయ్యాక ఉపాధి..
పీఎం–శ్రీ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులను స్కూల్ దశ నుంచే వృత్తి విద్య కోర్సుల వైపు ప్రోత్సహిస్తారు. ఏదో ఒక రంగంలో డిగ్రీ పూర్తయ్యాక సదరు రంగంలో వారిని నిష్ణాతులుగా మారి, ఉపాధి పొందాలనేది నూతన విద్యావిధానం ప్రధాన ఉద్దేశం.
అధిక సంఖ్యలో ప్రవేశాలు..
కమాన్‌పూర్, అప్పన్నపేట, రామగుండం, ఎగ్లాస్‌పూర్, పొత్కపల్లి హైస్కూళ్లలో ఏటా ఆరో తరగతిలో విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రవేశాలు పొందుతున్నారు. ఆయా పాఠశాలల్లో 300 నుంచి 500 మంది వరకు పిల్లలు చదువుకుంటున్నారు. క్రీడామైదానాలతోపాటు విద్యార్థులకు సరిపడా వాష్‌రూమ్స్ ఉన్నాయి. 20 నుంచి 26 మందికి వరకు టీచర్లు ఉన్నారు.