29 నుంచి ‘ఎడ్యుఫెస్ట్–2022’
Sakshi Education
Teacher's Dayను పురస్కరించుకొని ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు విద్యా వారోత్సవాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె.సురేష్‌కుమార్ సర్క్యులర్ జారీ చేశారు.
ఎడ్యుఫెస్ట్–2022 పేరుతో నిర్వహించే ఈ వారోత్సవాల్లో పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల్లోని ప్రముఖులు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్లు, రిటైర్డ్ టీచర్లను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. 31న వినాయక చవితి సెలవు రోజు మినహాయించి 29 నుంచి ఏ రోజున ఏ కార్యక్రమాలను చేపట్టాలో సర్క్యులర్‌లో పొందుపరిచారు.
చదవండి:
Published date : 27 Aug 2022 05:28PM