President Awards: ముగ్గురు తెలంగాణ టీచర్లకు రాష్ట్రపతి అవార్డులు
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు.
దేశవ్యాప్తంగా 46 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేసినట్టు కేంద్రం తెలిపింది. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న జరిగే గురుపూజ దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వనున్నారు. విద్యారంగంలో అంకిత భావం, అత్యున్నత ఫలితాల సాధనపై దృష్టి పెట్టిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేసినట్టు కేంద్రం తెలిపింది. ఎంపికైన వారిలో టీఎన్ శ్రీధర్ (జిల్లా పరిషత్ హైస్కూల్, మహబూబ్‌నగర్), కండ్ల రామయ్య (జెడ్పీ హైస్కూల్ అబ్బాపూర్, ములుగు జిల్లా), సునీతరావు (ప్రిన్సిపాల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం) ఉన్నారు. వీరికి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం, పతకాన్ని అందజేస్తారు.
చదవండి:
Published date : 26 Aug 2022 03:01PM