ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ గుర్తింపు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్నవారిలో తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు ఉన్నారు. తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టి.ఎన్ శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కందాళ రామయ్య, హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీతరావు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు. ఏపీ నుంచి విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డాక్టర్ రావి అరుణకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కా రాన్ని రాష్ట్రపతి ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్న అనంతరం వీరంతా ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
చదవండి: ఉత్తమ అధ్యాపక అవార్డులు.. గ్రహీతలు వీరే...
కందాల రామయ్యకో ‘లెక్క’ఉంది...
1998లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన కందాల రామయ్య ప్రస్తుతం ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం జిల్లా పరిషత్ పాఠశాల గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎమ్మెస్సీ, ఎంఈడీ చేశారు. నెట్ సాధించి ఉస్మా నియా యూనివర్సిటీలో మనోవిజ్ఞాన శాస్త్రంలో భావోద్వేగం, ప్రజ్ఞ, ఒత్తిడిని జయించడం, మూర్తిమత్వం అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. వీరి పరిశోధనాపత్రాలు అంతర్జాతీయస్థాయి జర్నల్స్‌లో ప్రచురితమ య్యాయి. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల రచయిత. ఉపాధ్యాయుల కరదీపికలు, పిల్లలకు కృత్య రూపకల్పనలో దిట్ట. విద్యా పరిశోధన మండలి నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో గణిత ప్రయోగశాల కృత్యాలను వినూత్నంగా రూపొందించి ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
చదవండి: Professor Santhamma Inspiring Story: 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో... ప్రొఫెసర్ శాంతమ్మ!
డీపీఎస్ ప్రిన్సిపాల్‌కు జాతీయ అవార్డు
నాచారంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) ప్రిన్సిపాల్ సునీతారావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకుంది. హైద రాబాద్‌కు చెందిన సునీతారావు సీబీఎస్‌ఈ, అంతర్జాతీయ పాఠశాలల్లో 32 ఏళ్లుగా పనిచేస్తు న్నారు. 2006 నుంచి నాచారం డీపీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2018లో సీబీఎస్‌ఈ టీచర్ అవార్డును అందుకున్నారు. ప్రసుత్తం సునీతారావు సీబీఎస్‌ఈ 2021–2024కు గవర్నింగ్ బాడీ సభ్యురాలిగా కొసాగుతున్నారు.
చదవండి: 1998 DSC: కలల కొలువు దక్కింది.. జీవిత చిత్రం మారింది
సామాన్యశాస్త్రంలో శ్రీధర్ పరిశోధనలు అసామాన్యం
టీఎన్ శ్రీధర్ 1995లో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని యన్మన్‌గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాన్యశాస్త్రం టీచర్‌గా పనిచేస్తున్నారు. 2011లో నవాబుపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్నప్పుడు 167 ప్రయోగాలతో సైన్స్ విజ్ఞానం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. విద్యార్థితో వినికిడి యంత్రం తయారు చేయించి జాతీయస్థాయి సైన్స్ సెమి నార్‌కు ఎంపికయ్యారు. ప్రతి విద్యార్థి తనకున్న వనరులతో సైన్స్ ప్రయోగాలు చేసేలా ప్రత్యేక ‘జాయ్‌ఫుల్ లర్నింగ్ సెల్ఫ్ కలెక్షన్ మెటీరియల్’పేరిట ఆయన రాసిన థీసెస్‌కు 2018లో జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. 2009లో పాఠశాలల్లో తక్కువ ఖర్చుతో సైన్స్ ల్యాబ్‌లో పరికరాలు ఏర్పాటు చేసుకోవడం ఎలా అనే అంశంపై పరిశోధనాపత్రం సమర్పించగా ఇస్రో నుంచి ప్రత్యేక గుర్తింపు, అవార్డు పొందారు. పేద విద్యార్థుల కోసం ‘కలాం డ్రీం ఫోర్సు అకాడమీ’పేరిట ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు.