Skip to main content

Best Teacher Awards: 47 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. ఎంపికైన వారు వీరే..

సాక్షి, హైదరాబాద్‌: విద్యా బోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న‌ గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించనుంది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. సెప్టెంబర్ 5న‌ సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
Best Teacher Awards  State government awards ceremony for best teachers Teachers receiving awards on Gurupujotsavam  113 educators honored for excellence in education  Award presentation to teachers and university faculty

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. 

ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు కలిపి మొత్తం 113 మందికి ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 12 మంది హెచ్‌ఎంలు, 23 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 12 మంది ఎస్‌జీటీలు, ఉన్నత విద్యలో పనిచేస్తున్న 55 మందిఅధ్యాపకులు, ఇంటర్‌ విద్యలో పనిచేస్తున్న 11 మంది లెక్చరర్లు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు.  

చదవండి: National Teachers Award: తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన ఏకైక వ్య‌క్తి ఈమెనే..

పురస్కారాలకు ఎంపికైన వారు వీరే..

ప్రధానోపాధ్యాయులు:  టి భాస్కర్‌ (పాఠశాల/జిల్లా: తెల్లాపూర్, సంగారెడ్డి), మెస నరేందర్‌ (ఆలూరు, నిజామాబాద్‌), ఏవీ సత్యవతి–రిటైర్డ్‌ (నయాబజార్, హైదరాబాద్‌), ఎస్‌.కె. తాజ్‌బాబు (రాయదుర్గ్, రంగారెడ్డి), టి సునీత (కోటకొండ, నారాయణ్‌పేట్‌), బి. బాపూరెడ్డి (కుషాయిగూడ, మల్కాజ్‌గిరి), పి.శంకర్‌గౌడ్‌ (యాప్రాల, వనపర్తి), పి. పద్మజ (కసనగోడ, నల్లగొండ), కె.నర్సయ్య (అంకోలి, ఆదిలాబాద్‌), కె.ఇందుమతి(హసన్‌పర్తి, హనుమకొండ), డాక్టర్‌ ప్రభు దయాల్‌ (రామాపురం, కొత్తగూడెం), జి. రాజన్న (హనుమకొండ).

స్కూల్‌ అసిస్టెంట్లు: కె. నర్సింహులు (ఇబ్రహీంనగర్, మహబూబ్‌నగర్‌), కొంక అనురాధ (కొత్తూరు, వరంగల్‌), కూన రమేశ్‌ (చిచోలి–బి, నిర్మల్‌), ముద్దుకృష్ణ (దుబ్బ, నిజామాబాద్‌), జె. రాజశేఖర్‌రావు (చిన్నముద్దునూర్, నాగర్‌కర్నూల్‌), ఎస్‌.సురేందర్‌ (అన్నారం, మంచిర్యాల), సీహెచ్‌ షర్మిల (అలుబాక, ములుగు), ఎం.రమేశ్‌ (బ్రాహ్మణపల్లి, పెద్దపల్లి), జి.రాజయ్య (మొగుళ్ళపల్లి, భూపాలపల్లి), జి.అంజన్‌కుమార్‌ (ఎనీ్టపీసీ జ్యోతినగర్, పెద్దపల్లి), కృష్ణకాంత్‌ నాయక్‌ (మిర్యాలగూడ, నల్లగొండ), సీహెచ్‌ గిరిప్రసాద్‌ (తిమ్మాపురం, సూర్యాపేట), ఎన్‌.అమరేందర్‌ రెడ్డి (కొంపల్లి, భూపాలపల్లి), పి.శంకర్‌గౌడ్‌ (శివనగర్, సిరిసిల్ల), జి.వెంకటేశ్వర్లు (పెద్దగోపతి, ఖమ్మం), కె.సత్యం(కందానెల్లి, వికారాబాద్‌), టి.స్వర్ణలత (పాల్వంచ, కామారెడ్డి), వి.రామకృష్ణ(చిన్నమల్లారెడ్డి, కామారెడ్డి), పి.రూపారాణి (సిరిసినగండ్ల, సిద్దిపేట), ఆర్‌.కృష్ణప్రసాద్‌ (నాగ్‌పూర్, మెదక్‌), హెచ్‌.విజయకుమార్‌ (ముడిమనిక్, సంగారెడ్డి), కె.కృష్ణయ్య(కుత్బుల్లాపూర్, రంగారెడ్డి).  

ఎస్‌జీటీలు:  జె. శ్రీనివాస్‌ (అక్కపల్లిగూడ, మంచిర్యాల), వై.వెంకటసురేశ్‌ కుమార్‌ (రామంచ, సిద్దిపేట), పి.రఘురామరావు (జీడీపల్లి, నాగర్‌కర్నూల్‌), దాసరి శంకర్‌ (పీచర్ల, నిర్మల్‌), పల్సి శ్రీనివాస్‌ (భైంసా, నిర్మల్‌), కె సుధాకర్‌ (తిడుగు, జనగాం), డి.కవిత(పెద్ద రాజమూర్, మహబూబ్‌నగర్‌), ఎం. క్రాంతికుమార్‌ (సింగన్నగూడ, సిద్దిపేట), కె. నాగేశ్వరి (పటేల్‌గూడ, సంగారెడ్డి), దల్లి ఉమాదేవి (ఆర్‌ఎన్‌ గుట్ట, భద్రాద్రి కొత్తగూడెం), జి. శ్రీనివాస్‌ (కీసరగుట్ట, మల్కాజ్‌గిరి), ఎంఎ అలీమ్‌ (గద్వాల్, నిజామాబాద్‌) 

Published date : 05 Sep 2024 12:31PM

Photo Stories