Competitions: గురజాడ, జాషువాలపై విద్యార్థులకు పోటీలు..
Sakshi Education
గురజాడ అప్పారావు, గుర్రం జాషువా జయంతిలను పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని గురుకులాల విద్యార్థులకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 21న గురజాడ జయంతి కాగా, 28న జాషువా జయంతి నిర్వహిస్తున్నారు. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. గురజాడ, జాషువాకు సంబంధించిన అంశాలపై సెప్టెంబర్ 27వ తేదీన పద్య పోటీలు, వక్తృత్వం, వ్యాస రచన పోటీలను నిర్వహించి, సెప్టెంబర్ 28వ తేదీన బహుమతులు అందజేస్తారు.
చదవండి:
Published date : 20 Sep 2021 12:47PM