Applications: ప్రైవేటు స్కూళ్లలో పేదల ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం ప్రకారం 2023–24 విద్యా సంవత్సరానికి గాను పేద వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తోంది.
ఇందుకోసం మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ సూచించింది. ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ అమలు చేస్తున్న స్కూళ్లు మార్చి 19లోగా తమ రిజి్రస్టేషన్లను పూర్తి చేయాలని ఆదేశించింది.
చదవండి: విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి కార్యశాల నిర్వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల
విద్యార్థుల తల్లిదండ్రులు 22వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు అర్హులను ఎంపిక చేసి.. ఏప్రిల్ 18న మొదటి రౌండ్ ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. ఏప్రిల్ 19 నుంచి 25 వరకు ఆయా స్కూళ్లు వీరికి ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 29న రెండో విడత ఎంపిక జాబితా విడుదల చేస్తారు. వీరికి మే 1 నుంచి మే 5 వరకు ప్రవేశాలు కల్పించాలి.
Published date : 18 Mar 2023 05:01PM