విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే చర్యలు
Sakshi Education
ఒంగోలు సబర్బన్: పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు సకాలంలో హాల్‌టికెట్లు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి హెచ్చరించారు.
ఈ మేరకు ఆమె మిర్చి 14న ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు ఫీజులు చెల్లించలేదంటూ హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని కమిషన్‌కు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశామన్నారు. హాల్‌టికెట్లు ఇవ్వకపోతే విద్యార్థులు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 7635కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ | మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్
Published date : 15 Mar 2023 05:20PM