AP 10th Class Public Exams 2023 : ఏపీ పదోతరగతి విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి కొత్త నిబంధనలు ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా
ఈ పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లలను కూడా విడుదల చేసింది. అలాగే వీటిని మార్చి 14వ తేదీ నుంచి ఈ హాల్‌టికెట్లలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
హాల్‌టికెట్లును.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
పదో తరగతి హాల్‌టికెట్లను ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నామినల్ రోల్స్ ఆధారంగా పాఠశాల లాగిన్ ద్వారా బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిని ధ్రువీకరించి తమ పాఠశాల విద్యార్థులకు జారీచేస్తారు. హాల్‌టికెట్‌పై విద్యార్థి ఫొటో లేకపోయినా, తప్పుగా ముద్రితమైనా ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి సరైన ఫొటోను అతికించి దాన్ని సక్రమంగా ధ్రువీకరించి సంబంధిత విద్యార్థికి అందించాలి. అటెస్ట్ చేసిన హాల్‌టికెట్ల కాపీని పరీక్షకేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌లకు ఫార్వర్డ్ చేయాలి. అటువంటి విద్యార్థులను పరీక్షకేంద్రాల్లోకి అనుమతించాలని అభ్యర్థన పంపాలి.
☛ పదోతరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే చర్యలు
ఫొటోమార్పు దరఖాస్తును (వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది) ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయానికి పరీక్షలు పూర్తయ్యేలోపు పంపాలి. స్ట్రీమ్, జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీలను నమోదు చేయడం ద్వారా ఇతరులు కూడా బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పదోతరగతి విద్యార్థులకు అలర్ట్. ఈ సారి కొత్త నిబంధనలు..
విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లలను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
☛ పరీక్షల ఒత్తిడిని ఇలా జయిస్తే.. విజయమే మీదే!!
ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే..
☛ హాల్‌టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్‌మాస్టర్/ప్రిన్సిపాల్‌ని సంప్రదించాలి.
☛ విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకపోతే పరీక్షకు అనుమతించరు.
☛ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, కెమెరాలు, ఇయర్ ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. ఎవరైనా వాటిని లోపలకు తీసుకువెళ్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.
☛ విద్యార్థులు ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలను వేర్వేరు సమాధాన పత్రాల్లో రాయాలి. ఈ రెండింటి కోసం వేర్వేరుగా 12 పేజీల సమాధానాల బుక్‌లెట్లు ఇస్తారు.
☛ విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో మినహా 12:45 గంటల వరకు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు.
☛ ప్రశ్నపత్రాల లీక్ అని తప్పుడు, నిరాధారమైన పుకార్లకు పాల్పడకూడదు. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
☛ పరీక్ష సమయంలో అక్రమాలకు పాల్పడేవారిపై, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయి. అలాంటివారిని తదుపరి పరీక్షలు రాయనీయరు.
☛ విద్యార్థి పేరు, రోల్ నంబర్, ఇతర వివరాలను 24 పేజీల జవాబు బుక్‌లెట్, మ్యాప్ లేదా గ్రాఫ్ షీట్‌లోని ఏ పేజీలోనూ రాయకూడదు.
☛ కాగా పరీక్షలు జరిగే రోజుల్లో ఎంఈవోలు, హెచ్‌ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ల విధులపైనా సూచనలు జారీ చేశారు.