Skip to main content

10th Class Exams Dates: మార్చిలో పదో తరగతి పరీక్షలు..పూర్తి వివ‌రాలు ఇలా..

సాక్షి, గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.
Adimulapu Suresh
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాసంస్థలకు సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95% వ్యాషినేషన్ పూర్తి చేశామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామని పేర్కొన్నారు. 

35% ఫ్రీ సీట్లు.. 
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు యూనివర్సిటీలో చట్టసవరణ ద్వారా 35% ఫ్రీ సీట్లు ఇప్పించామని పేర్కొన్నారు. ఏ విద్యార్ధి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని అమ్మఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్తో పాటు మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్తూ తెలుగు కూడా బోధిస్తున్నామన్నారు.

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్ కోసం క్లిక్ చేయండి

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి మోడ‌ల్‌పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి టెక్స్ట్ బుక్స్ కోసం క్లిక్ చేయండి

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి సిల‌బ‌స్‌ కోసం క్లిక్ చేయండి

Published date : 07 Jan 2022 05:24PM

Photo Stories