Skip to main content

27 శాతం మంది పిల్లలకే స్మార్ట్‌ ఫోన్లు.. వివిధ రాష్ట్రాల్లో స్కూల్ పిల్లల వివరాలు

దేశంలో 26.1 శాతం మంది స్కూల్‌ పిల్లల చదువులకు స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో లేవని జాతీయ విద్యా వార్షిక సర్వే – 2021 పేర్కొంది.
online classes
27 శాతం మంది పిల్లలకే స్మార్ట్ఫోన్ల.. వివిధ రాష్ట్రాల్లో స్కూల్ పిల్లల వివరాలు

67.6 శాతం మంది స్కూల్‌ విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్‌ ఫోన్లు ఉన్నప్పటికీ 26.1 శాతం మంది చదువులకు అవి అందుబాటులో ఉండటం లేదని వెల్లడించింది. కేవలం 27 శాతం మంది పిల్లలకు మాత్రమే అన్ని వేళల్లో స్మార్ట్‌ ఫోన్ లు అందుబాటులో ఉంటున్నాయని తెలిపింది. మరో 47 శాతం మంది పిల్లల చదువులకు కొన్ని సమయాల్లోనే స్మార్ట్‌ ఫోన్ లు అందుబాటులో ఉంటున్నాయని వివరించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్‌కు వెళ్లే పిల్లల్లో 72.3 శాతం మంది ఇళ్లల్లో స్మార్ట్‌ ఫోన్ లు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. అయితే ఇంట్లో స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పటికీ 18.6 శాతం మంది పిల్లల చదువులకు ఆ ఫోన్ లు అందుబాటులో ఉండటం లేదని సర్వేలో వెల్లడైంది. మరో 35.8 శాతం మంది పిల్లల చదువులకు అన్ని వేళల్లో స్మార్ట్‌ ఫోన్ లు అందుబాటులో ఉంటున్నాయి. మరో 45.7 శాతం పిల్లలకు కొన్ని సమయాల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. కాగా, జాతీయ విద్యా వార్షిక సర్వేను ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో నిర్వహించి గత నెలలో నివేదిక విడుదల చేశారు. యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్ రిపోర్ట్‌ (అసర్‌) పేరిట ఈ సర్వేను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు, 581 జిల్లాల్లో సర్వే జరిగింది. మొత్తం 76,706 ఇళ్లను ఫోన్ ద్వారా సర్వే చేశారు.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో స్కూల్‌ పిల్లల చదువులకు స్మార్ట్‌ ఫోన్ల అందుబాటు శాతాల్లో ఇలా..

రాష్ట్రం

పిల్లల ఇళ్లల్లో స్మార్ట్‌ ఫోన్లు

అన్ని వేళల్లో చదువులకు

కొన్ని వేళల్లోనే లభ్యత

అసలు లభ్యతే లేదు

తెలంగాణ

79.3

42.2

33.9

23.9

అరుణాచల్‌ ప్రదేశ్‌

84.6

29.4

50.7

19.9

అసోం

71.0

25.7

51.4

22.9

బిహార్‌

54.4

11.8

34.4

53.8

ఛత్తీస్‌గఢ్‌

81.6

25.3

41.6

33.1

గుజరాత్‌

88.4

37.9

57.5

4.7

హరియాణా

86.3

38.4

49.2

12.5

హిమాచల్‌ప్రదేశ్‌

95.6

25.1

74.2

0.8

జమ్మూకశ్మీర్‌

72.8

40.1

44.4

15.6

జార్ఖండ్‌

60.2

20.7

39.6

39.7

కర్ణాటక

71.6

35.6

52.7

11.7

కేరళ

97.5

76.2

21.2

2.6

మధ్యప్రదేశ్‌

69.2

31.8

49.7

18.5

మహారాష్ట్ర

85.5

27.0

62.7

10.3

మణిపూర్‌

92.9

35.6

39.9

24.5

మేఘాలయ

77.9

35.2

34.2

30.7

నాగాలాండ్‌

92.9

55.2

41.0

3.8

ఒడిశా

64.6

46.5

34.3

19.2

పంజాబ్‌

89.9

43.2

55.7

1.1

రాజస్థాన్

66.6

21.1

45.5

33.4

తమిళనాడు

66.1

26.8

59.5

13.7

ఉత్తరాఖండ్‌

75.6

31.0

57.6

11.4

ఉత్తరప్రదేశ్‌

58.9

18.7

47.0

34.3

పశ్చిమ బెంగాల్‌

58.4

12.8

40.7

46.5

చదవండి:

Gurukul School: అట్టడుగు విద్యార్థులకు అత్యున్నత అవకాశాలు

CAG: జగన్ ప్రభుత్వంలోనే ఎయిడెడ్‌కు జీవం

Teachers: సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

Published date : 08 Dec 2021 01:45PM

Photo Stories