CAG: జగన్ ప్రభుత్వంలోనే ఎయిడెడ్‌కు జీవం
అలాగే పట్టణ, గ్రామీణ సంస్థలు, సహకార సంస్థలకు ఆరి్థక సాయం, విద్యుత్ రాయితీల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే అత్యధిక మేలు జరిగింది. అన్ని రకాల ఎయిడెడ్ విద్యా సంస్థలకు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ. 9,600 కోట్లు గ్రాంటుగా ఇవ్వగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత 2019–20లో రూ. 10,048 కోట్లు గ్రాంటుగా ఇచ్చినట్లు కాగ్ పేర్కొంది. అధికారంలో ఉండగా ఖాళీల భర్తీలు చేపట్టకుండా, సరైన పర్యవేక్షణ చేయకుండా ఎయిడెడ్ సంస్థలను కునారిల్లేలా చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే బురద జల్లుతుండడం విడ్డూరంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఒక్క అమ్మ ఒడి పథకం కోసం 2019–20 ఆరి్థక ఏడాదిలోనే రూ. 6,349.47 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఇక విద్యుత్ రాయితీలను చంద్రబాబు ప్రభుత్వం భారీగా కుదించేసినట్లు నివేదికలో తేలింది. సీఎం జగన్ వచ్చిన తర్వాత విద్యుత్ రాయితీల కోసం ఏకంగా నాలుగున్నర రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు. 2019–20లో వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ కోసమే రూ. 4,919.84 కోట్లను వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. ఇక సహకార సంస్థలకు గత ప్రభుత్వం కేవలం రూ. 543 కోట్లు కేటాయించి పూర్తిగా నిరీ్వర్యం చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ. 9,487 కోట్లు గ్రాంటుగా ఇచ్చినట్లు వెల్లడైంది.
2018–19, 2019–20 ఆరి్థక ఏడాదిల్లో గ్రాంట్ల రూపంలో పలు సంస్థలకు, శాఖలకు చేసిన ఆరి్థక సాయం వివరాలు ఇలా..
రంగం |
2018–19 (రూ. కోట్లలో) |
2019–20 (రూ. కోట్లలో) |
పట్టణ స్థానిక సంస్థలు |
3,775 |
4,157 |
గ్రామీణ స్థానిక సంస్థలు |
8,357 |
10,409 |
ఎయిడెడ్ విద్యా సంస్థలు |
9,600 |
10,048 |
సహకార సంస్థలు |
543 |
9,487 |
విద్యుత్ రాయితీ |
1250 |
5,248 |
|
|
|
చదవండి:
CAG Report: ఏ శాఖల విభాగాల అకౌంట్లలో అవకతవకలు ఉన్నట్లు కాగ్ తెలిపింది?
PM Modi: కాగ్ తొలి ఆడిట్ దివస్‌ను ఎప్పుడు నిర్వహించారు?
CAG GC Murmu: భారత కాగ్ జీసీ ముర్ము ఏ అంతర్జాతీయ సంస్థ చైర్మన్‌గా ఎంపికయ్యారు?