Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యాదీవెనకు ఇన్ని దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విదేశీ విద్యాదీవెన పథకానికి 186 దరఖాస్తులు వచ్చాయి.
జగనన్న విదేశీ విద్యాదీవెనకు ఇన్ని దరఖాస్తులు
తొలుత దరఖాస్తుల దాఖలుకు గడువును జూన్ 10వ తేదీగా ప్రకటించినా.. అభ్యర్థుల విజ్ఞాపనల మేరకు జూన్ నెలాఖరు వరకు పొడిగించారు. కాగా, దరఖాస్తుదారులకు జూలై 4 నుంచి తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.