Skip to main content

10th Class Hall Tickets & Model Papers: పదో తరగతి హాల్‌టికెట్లు సిద్ధం.. 100% మార్కులు సాధించాలంటే ఈ మోడల్ పేపర్స్ చదవండి

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్‌టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి మార్చి 3న‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Andhra Pradesh Class 10th Exam Preparation   Sakshi Education Model Papers for AP Class 10th  10th Class Hall Tickets & Model Papers    Model Papers for AP Class 10th Exams

Sakshieducation ప్ర‌తేక్యంగా మోడ‌ల్ పేపర్లును రూపొందించింది

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి, విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో, https://education.sakshi.com విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా మోడల్ పేపర్లును రూపొందించింది. ఈ మోడల్ పేపర్లు పాఠ్య ప్రణాళికలోని అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తాయి, ఈ మోడల్ పేపర్ల వల్ల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పదో తరగతి మోడ‌ల్ పేపర్లు - 2024 కోసం క్లిక్ చైయండి.

పాఠ­శాలల యాజమాన్యాలు స్కూల్‌ కోడ్‌ 

నంబర్‌తోను, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి మార్చి 4న‌ మధ్యాహ్నం నుంచి https://www.bse.ap.gov.in/ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌­లోడ్‌ చేసుకోవచ్చన్నారు. 

2023–24 విద్యా సంవ­త్సరంలో 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యా­ర్థులు టెన్త్‌ పరీక్షలకు హాజరుకాను­న్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. 

చదవండి: Free Service for Students: టెన్త్‌ విద్యార్థులకు ఉచిత ప్రయాణ అవకాశం..!

ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగు­స్తుండగా, మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 682 సిట్టింగ్‌ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా..

మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్‌-1

మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్

మార్చి 21 - ఇంగ్లీష్‌

మార్చి 23 - గణితం

మార్చి 26 - ఫిజిక్స్

మార్చి 28 - బయాలజీ

మార్చి 30 - సోషల్ స్టడీస్







Published date : 04 Mar 2024 01:04PM

Photo Stories