Skip to main content

Tenth Class: మూల్యాంకనం ప్రారంభ తేదీలు ఇవే.. రోజు ఇన్ని పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయాలి

రాప్తాడు రూరల్‌: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌) ఈ నెల 19 నుంచి 26 వరకు జరుగుతుందని డీఈఓ ఎం.సాయిరామ్‌ తెలిపారు.
Tenth Class
పదో తరగతి మూల్యాంకనం ప్రారంభ తేదీలు ఇవే.. రోజు ఇన్ని పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయాలి

అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ బాలికల పాఠశాలలో జరిగే మూల్యాంకన ప్రక్రియకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన జవాబు పత్రాల కోడింగ్‌ ప్రారంభమైందని తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 14న‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ మూల్యాంకనం విధులకు నియమించిన ప్రతి ఒక్కరూ విధిగా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు. ఎవరికై నా తీవ్రమైన అనారోగ్య సమస్య ఉన్నవారు తగిన ఆధారాలతో డీఈఓను కలిస్తే మినహాంపు ఇస్తామన్నారు.

చదవండి:

‘World Quantum Day’కు ట్రిపుల్‌ ఐటీ శాస్త్రవేత్తలు

Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు

Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

ఇంటర్‌ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన

  •  అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు ఒక రోజులో 40 జవాబు పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయాలి.
  •  సంబంధిత అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన అన్ని సమాధాన పత్రాల మార్కులను స్పెషల్‌ అసిస్టెంట్లు లెక్కించాలి. ప్రత్యేక సహాయకులు వీటిని కూడా ధ్రువీకరించాలి.
  • చీఫ్‌ ఎగ్జామినర్‌ ప్రతి అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ మూల్యాంకనం చేసిన కనీసం 20 ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను వెరిఫై చేయాలి. (అంటే మొత్తం 60 ఆన్సర్‌ స్క్రిప్ట్‌లు వెరిఫై చేయాల్సి ఉంటుంది).
  • అసిస్టెంట్‌ క్యాంప్‌ ఆఫీసర్లు ప్రతి అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ నుంచి కనీసం 2 స్క్రిప్ట్‌లను వెరిఫై చేయాలి.
  • డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌ రోజుకు కనీసం 45 వాల్యుయేట్‌ స్క్రిప్ట్‌లను వెరిఫై చేయాలి.
  • క్యాంపు అధికారి రోజుకు కనీసం 20 జవాబు పత్రాలను ధ్రువీకరించాలి.
  • రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులకు సమాధాన పత్రాల ఫొటోస్టాట్‌ కాపీలు అందిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యాంకనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డీఈఓ సూచించారు.
Published date : 15 Apr 2023 04:45PM

Photo Stories