DAO Grade 2 Syllabus: డీఏఓ గ్రేడ్‌-2 రాత‌ప‌రీక్ష సిల‌బ‌స్ ఇదే.. వీటిపై ప‌ట్టు ఉంటే విజ‌యం మీదే..

ఇటీవలే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
TSPSC DAO Grade 2 Exam Syllabus

దీని ద్వారా డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ పరిధిలోని పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.. విజేతలను ప్రకటించి కొలువులు ఖరారు చేస్తారు. ఈ రాత పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తులు కూడా సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభంమైన‌వి. ఈ నేపథ్యంలో డీఏఓ గ్రేడ్‌-2 రాత పరీక్షకు సంబంధించిన సిల‌బ‌స్ మీకోసం..

TSPSC Groups 2, 3 Jobs : 2,910 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి ఉత్తర్వులు జారీ.. గ్రూప్ 2, 3 నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

ఈ రాత పరీక్షలో..
డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లను రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రాత పరీక్షలో పొందాల్సిన కనీస అర్హత మార్కులను నిర్దేశించారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం, బీసీ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాల అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

రాత పరీక్ష విధానం : 

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు నిర్వహించే రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ 150 ప్రశ్నలు 150 మార్కులకు; పేపర్‌ 2లో అర్థమెటిక్‌ అండ్‌ మెన్సురేషన్‌ 150 ప్రశ్నలు 300 మార్కులకు పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షను ఓఎంఆర్‌ షీట్‌ విధానం లేదా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహించనున్నట్లు నోటిఫికేన్‌లో పేర్కొన్నారు.

డీఏఓ పేపర్‌-1 సిల‌బ‌స్ ఇలా..
డీఏఓ పేపర్‌-1గా పేర్కొన్న జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌లో.. అభ్యర్థులు ప్రాంతీయం నుంచి అంతర్జాతీయ అంశాల వరకూ.. అన్నింటిపైనా అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమున్న అంశాలపై ప‌ట్టు పట్టాలి.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం,వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. 

తెలంగాణ విధానాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు..నిధులు..నియామకాలు.. వంటి అంశాలపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన పథకాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారో తెలుసుకోవాలి. పర్యావరణానికి సంబంధించి తెలంగాణకు హరితహారం అమలుచేస్తున్నారు.

చ‌ద‌వండి: Polity Bit Bank For All Competitive Exams: ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్?

ముఖ్యంగా జాతీయ పథకాలపై..
మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం పలు విధానాలు అమలు చేస్తున్నారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు నూతన విద్యా విధానాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. నూతన విద్యా విధానం ముఖ్యాంశాలతోపాటు ఇప్పటి వరకు తీసుకొచ్చిన విద్యా విధానాలు, ప్రస్తుత విధానానికి, వాటికి మధ్య ఉన్న వ్యత్యాసం, ఉద్దేశం, ప్రధానాంశాలు, లక్ష్యాలు.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. వీటితోపాటు కోర్‌ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీకి సంబంధించిన అంశాలను కూడా ఔపోసన పట్టాలి. ఆయా సబ్జెక్ట్‌లను ప్రాంతీయ ప్రాధాన్యతల వారీగా అభ్యసించడం ఉపయుక్తంగా ఉంటుంది.

Geography Important Bit Bank: భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం ఏది?

అంతర్జాతీయ అంశాల‌పై ఇలా దృష్టి పెట్టాలి..
అభ్యర్థులు అంతర్జాతీయ అంశాలకు కూడా తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. సమకాలీన పరిణామాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్‌ మధ్య సాగుతున్న యుద్ధం, చైనా తైవాన్, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌ వంటి దేశాల అంతర్జాతీయ విధానాలు; జీ-8 సదస్సు, కామన్వెల్త్‌ క్రీడలుభారత క్రీడాకారుల ప్రతిభ, బ్రిటన్‌ ప్రధాని ఎంపిక ప్రక్రియ వంటి వాటిపై అవగాహన అవసరం.

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

డీఏఓ పేపర్‌-2 సిల‌బస్ : 

పేపర్‌-2(అర్థమెటిక్‌ అండ్‌ మెన్సురేషన్‌)లో అభ్యర్థులు కాన్సెప్ట్యువల్‌ ప్రిపరేషన్‌తోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. అర్థమెటిక్‌కు సంబంధించి నంబర్‌ సిస్టమ్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి.రేషనల్‌ నెంబర్స్, రియల్‌ నంబర్స్, సర్డ్స్‌ అండ్‌ లాగారిథమ్స్‌పై అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.రేషియోస్‌ అండ్‌ ప్రప్రోషన్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. యావరేజెస్,ప్రాఫిట్‌ అండ్‌ లాస్, డిస్కౌంట్, సింపుల్‌కాంపౌండ్‌ ఇంట్రస్ట్, పార్ట్‌నర్‌షిప్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్,టైమ్‌ అండ్‌ వర్క్, క్లాక్, క్యాలెండర్‌ వంటి అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

అదే విధంగా బహుపదులు, శ్రేఢులు వంటి అంశాలను అధ్యయనం చేయాలి. సమితులు, లీనియర్‌ ఈక్వేషన్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సగటు, మధ్యగతం, బాహుళకాలకు సంబంధించి అన్ని సిద్ధాంతాలను, సూత్రాలను అధ్యయనం చేసి.. వాటికి సంబంధించి సమస్యలను ప్రాక్టీస్‌ చేయాలి.

TS Gurukulam Jobs 2022 : త్వ‌ర‌లో టీఎస్ గురుకులం.. ఈ టిప్స్ పాటిస్తే మీకు జాబ్ త‌థ్యం..||TGT Best Preparation Tips

మెన్సురేషన్‌కు సంబంధించి కొలతలు,స్క్వేర్స్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, క్వాడ్రిలేటర్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. రేఖా గణిత అంశాలను కూడా ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా.. 2డి ప్లేన్స్, స్ట్రెయిట్‌ లైన్స్, అప్లికేషన్స్, ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్‌ అప్లికేషన్స్‌ తదితర అంశాలపై సంపూర్ణ పట్టు సాధించాలి.

APPSC Group1 Ranker Success Story : మా అమ్మ‌నాన్న కూలికి వెళ్తేనే.. మాకు అన్నం

#Tags