Search Committee: అత్యంత పారదర్శకంగా టీఎస్‌పీఎస్సీ నియామకాలు

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

 సెర్చ్‌ కమిటీకి పూర్తి అధికారాలను అప్పగించి సమర్థులకు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. ‘సుదీర్ఘ అనుభవం కలిగిన సివిల్‌ సర్వెంట్లు, విద్యావేత్తలకు ఈసారి బోర్డులో ప్రభుత్వం అవకాశం కల్పించింది. సామాజిక సమతుల్యతను పాటించింది. గతంలో ఎన్నడూ అవకాశం దక్కని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా నియామకాలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచే టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

చదవండి: TSPSC: చైర్మన్, సభ్యుల బయోడేటాలు

రాజకీయ ప్రమేయం లేకుండా నియామకాలను ప్రభు త్వం పూర్తి చేసింది..’ అని వివరించింది. చైర్మన్‌ పదవికి తొలుత రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధి కారి ఆకునూరి మురళి పేరును ప్రభుత్వం పరిశీలించినా, చైర్మన్‌ పదవికి గరిష్ట వయస్సు 62 ఏళ్లు కాగా, ఆయన వయోపరిమితి అనుకూలంగా లేకపోవడంతో వీలు పడలేదు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేరు కూడా పరిశీలనకు రాగా, ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం, రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకోవడంతో చివరకు రిటైర్డ్‌ డీజీపీ మహేందర్‌రెడ్డికి  బాధ్యతలు అప్పగించింది. 

#Tags