TSPSC: గ్రూప్‌–2, గ్రూప్‌– 3 ఖాళీల గుర్తింపునకు కసరత్తు షురూ!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌– 2, గ్రూప్‌–3 ఉద్యోగ ఖాళీల కసరత్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

శాఖల వారీగా గుర్తించిన గ్రూప్‌–2, గ్రూ ప్‌–3 ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్‌లో సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖాధిపతులను ఆదేశించింది.

ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖలకు మెమో జారీ చేశారు. 2022 ఆగస్టు 30వ తేదీ నాటికి గుర్తించిన ఖాళీలకు అనుగుణంగా భర్తీకి అప్పట్లో ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే.

ఈమేరకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2022 డిసెంబర్‌లో ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. ఆగస్టు 2022 తర్వాత నుంచి గుర్తించిన ఖాళీలు, మంజూరై ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు రానున్న ఏడాది కా లంలో ఖాళీ కానున్న గ్రూప్‌–2, గ్రూప్‌–3 ఉద్యోగాల వివరాలను మార్చి 6న‌ సాయంత్రం 5గంటల్లోగా సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఫార్మాట్‌ను ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ అధికారులు పంపించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

కొత్త పోస్టులతో కొత్త ప్రకటనలు...

ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2, గ్రూప్‌–3 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి వాటి భర్తీ ప్రక్రియకు సంబంధించిన చర్యలు వేగ వంతం చేసింది. గ్రూప్‌–2 కేటగిరీలో 783 ఖాళీలుండగా... వీటికి సంబంధించి అర్హత పరీక్షలను ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. అదేవిధంగా గ్రూప్‌–3 కేటగిరీలో 1388 ఖాళీల భర్తీకి గాను ఈ ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో అర్హత పరీక్షలను నిర్వహించనుంది.

తాజాగా ఈ రెండు కేటగిరీల్లో ఖాళీల గుర్తింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద ఖాళీలను గుర్తిస్తే వాటి భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తుండగా... కొత్త ఖాళీలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలా? లేక ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలా? అనే కోణంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. 

#Tags