Inter Spot Valuation: ఇంటర్‌ స్పాట్‌కు నేడు సెలవు.. కార‌ణం ఇదే..!

సాక్షి, హైదరాబాద్‌: హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 25న‌ ఇంటర్మీడియెట్‌ మూల్యాంకన ప్రక్రియకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

ఈమేరకు బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా మూల్యాంకన కేంద్రాలకు ఆదే శాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం జవాబు పత్రా ల మూల్యాంకనం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో చేపట్టారు. హోలీ రోజు సెలవు ఇవ్వా లని వివిధ సంఘాలు కోరిన నేపథ్యంలో బోర్డు సానుకూలంగా స్పందించింది.

చదవండి: Students Attendance for Exams: జిల్లాలో పది, ఇంటర్‌ పరీక్షలకు హాజరు, గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య..!

బోర్డు నిర్ణయాన్ని టీజీజేఏఎల్‌ఏ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కొప్పిశెట్టి సురేశ్, టీఐజీఎల్‌ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్‌ స్వాగతించారు.   
 

#Tags