Students Attendance for Exams: జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలకు హాజరు, గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య..!
ఏలూరు: జిల్లాలోని 139 కేంద్రాల్లో శనివారం పదో తరగతి భౌతికశాస్త్రం పరీక్షకు 24,132 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో 23,219 మంది విద్యార్థలు హాజరయ్యారు. అలాగే ఒకసారి ఫెయిలైన విద్యార్థులు 5,237 మందికి 3,078 మంది హాజరు కాగా 96.22 శాతం హాజరు నమోదైంది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 39 కేంద్రాలను, జిల్లా విద్యాశాఖాధికారి 3 కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఒక కేంద్రాన్ని మొత్తంగా 43 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. పరీక్షల్లో ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు.
Inter Exam Evaluation: రేపే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం..!
96 శాతం హాజరు
పశ్చిమగోదావరి జిల్లాలో పదో తరగతి భౌతికశాస్త్రం పరీక్షకు 96.57 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖా ధికారి ఆర్.వెంకటరమణ తెలిపారు. 22,139 మంది విద్యార్థులకు 759 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఎస్‌ఎస్‌సీ ఏపీఓఎస్‌ఎస్ పరీక్షకు 778 మందికి 668 మంది, ఇంటర్మీడియెట్ ఏపీఓఎస్‌ఎస్ పరీక్షకు 1,646 మందికి 1,489 మంది హాజరయ్యారని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదని డీఈఓ వెంకటరమణ చెప్పారు.
Gurukul Admissions: ఈ నెల 31లోగా గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.
‘ఓపెన్’ పరీక్షలకు 1,775 మంది హాజరు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులకు పబ్లిక్ పరీక్షలు శనివారం ఏలూరు జిల్లావ్యాప్తంగా జరిగాయి. ఏడు కేంద్రాల్లో పదో తరగతి శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం పరీక్షకు 737 మందికి 613 మంది, 9 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్మీడియెట్ భౌతికశాస్త్రం పరీక్షకు 545 మందికి 493 మంది హాజరయ్యారు.
TS Tenth Exams: పదో తరగతి పరీక్ష కేంద్రాల తనిఖీ..
అలాగే రాజనీతిశాస్త్రం పరీక్షకు 752 మందికి 669 మంది హాజరయ్యారు. జిల్లాస్థాయి పరిశీలకులు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, డీఈసీ కమిటీ సభ్యులు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు.
Tags
- AP Tenth
- Intermediate
- Board Exams
- AP exams
- Students Attendance
- education officers
- examinars
- students at exam centers
- inspection of exam centers
- Education News
- Sakshi Education News
- Eluru news
- AP Board exams
- Eluru exams
- District Education Officer updates
- Examination centre inspections
- Student attendance
- Student absence
- Education Updates
- Exam administration
- Exam management
- Exam oversight
- SakshiEducationUpdates